అమెరికా, కెనడా దేశాలను ‘లీ’ తుఫాను కుదిపేసింది.
ఈశాన్య యునైటెడ్ స్టేట్స్, కెనడాలోని పలు ప్రాంతాల్లో లీ తుఫాను బీభత్సానికి దాదాపు 10 వేల మంది ప్రజలకు విద్యుత్ అంతరాయం కలిగి చీకట్లో మగ్గిపోయారని అక్కడి అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాము సూచించామని చెప్పారు.