AI ఆధారిత నూతన సాంకేతిక పరిజ్ఞానం అన్ని విభాగాల్లో శరవేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు, కొత్త తరం నిపుణులు దీనిపై అత్యంత ఆసక్తిగా ఉన్నట్లు, ఉద్యోగ భవిష్యత్తుకు AI లో నైపుణ్యం సాధించడం ఎంతో అవసరమని భావిస్తున్నట్లు LinkedIn నిర్వహించిన సర్వేలో తేలింది.
AI ని అందిపుచ్చుకొని స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగితే ప్రయోజనం ఉంటుందని LinkedIn నిపుణులు తెలిపారు.