ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః


నేటి పంచాంగము


విక్రమ సంవత్సరం: 2080 నల

శక సంవత్సరం: 1945 శోభకృత్

ఆయనం: దక్షిణాయణం

ఋతువు: వర్ష

మాసం: భాద్రపద

పక్షం: కృష్ణ – బహుళ

తిథి: విదియ ప‌.12:36 వరకు
తదుపరి తదియ

వారం: ఆదివారం – భానువాసరే

నక్షత్రం: అశ్విని రా.11:23 వరకు
తదుపరి భరణి

యోగం: వ్యాఘత ప‌.01:01 వరకు
తదుపరి హర్షణ

కరణం: గరజ ప‌‌.12:36 వరకు
తదుపరి వణిజ రా‌.11:52 వరకు
తదుపరి భధ్ర

వర్జ్యం: రా.07:31 – 09:04 వరకు

దుర్ముహూర్తం: సా.04:29 – 05:17

రాహు కాలం: సా‌.04:35 – 06:05

గుళిక కాలం: ప‌.03:05 – 04:35

యమ గండం: ప‌.12:05 – 01:35

అభిజిత్: 11:42 – 12:28

సూర్యోదయం: 06:06

సూర్యాస్తమయం: 06:05

చంద్రోదయం: రా.07:36

చంద్రాస్తమయం: ఉ‌.07:45

సూర్య సంచార రాశి: కన్య

చంద్ర సంచార రాశి: మేషం

దిశ శూల: పశ్చిమం

శ్రీ శ్రీనివాసతీర్థ‌ పుణ్యతిథి‌

ఉండ్రాళ్ళ తదియ‌
( మతాంతరం)

బహుళా వ్రతం


నేటి రాశి ఫలాలు


మేషం:

ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో నిరాశ.

వృషభం:

కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు కలసిరావు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయదర్శనాలు.

మిథునం:

శుభవార్తలు వింటారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు సఫలం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

కర్కాటకం:

బంధువులతో వివాదాలు. ధనవ్యయం. కుటు-ంబంలో చికాకులు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.

సింహం:

కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. నిరుద్యోగుల ఆశలు నెరవేరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.

కన్య:

వ్యవహారాలు మందగిస్తాయి. అనారోగ్యం. కుటు-ంబ సభ్యులతో వివాదాలు. శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి. విద్యార్థులకు నిరుత్సాహం.

తుల:

కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. శుభకార్యాలకు హాజరవుతారు. దైవదర్శనాలు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

వృశ్చికం:

చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. విద్యార్థుల యత్నాలు సానుకూలం. కొన్ని వివాదాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

ధనుస్సు:

కొత్తగా రుణాలు చేస్తారు. బంధువులు, మిత్రులతో వివాదాలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మకరం:

ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. బంధువులతో వైరం. ఇంటాబయటా సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

కుంభం:

నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఎంతటి వారినైనా ఆకట్టు-కుంటారు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

మీనం:

ఆదాయం పెరుగుతుంది. కార్యజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. దైవదర్శనాలు.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)