విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై విస్తృత స్థాయి సంప్రదింపుల తర్వాతే ముందుకెళ్తామని కేంద్రం పార్లమెంటులో వెల్లడించింది.

‘ప్లాంట్లో పెట్టుబడులు ఉపసంహరణ ప్రక్రియకు, భూములు, ఇతర ఆస్తుల విక్రయానికి భాగస్వామ్య పక్షాలతో చర్చలు అవసరం.

ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని కేంద్ర మంత్రి భగవత్ కరాడ్ తెలిపారు. ఇందులో 100 శాతం వాటా విక్రయానికి 2021లో కేబినెట్ అంగీకారం తెలిపిందన్నారు.