చైనాకు చెందిన డాంగోపో పేపర్ కంపెనీ ఉద్యోగులకు వినూత్న బోనస్ ఆఫర్ ప్రకటించింది.
నెలకు 50 కిలోమీటర్లు పరిగెత్తిన వారికి ఫుల్ బోనస్ ఇవ్వనుంది. 40km పరిగెత్తిన వారికి 60% మంత్లీ బోనస్, 30km పరిగెత్తిన వారికి 30% బోనస్ అందించనుంది.
ఒకవేళ నెలకు 100km పరిగెత్తితే ఫుల్ బోనస్కు అదనంగా మరో 30శాతం ఇస్తామని ప్రకటించింది. అయితే ఏటా ఉద్యోగులకు ఇచ్చే బోనస్ విధానాన్ని రద్దు చేసి ఈ ఆఫర్ చేయడం కొసమెరుపు.