OCDతో బాధపడుతున్న వారిపై చేసిన సర్వేలో షాకింగ్ విషయాలు తెలిశాయి. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఉన్న వ్యక్తులు మిగతావారితో పోల్చితే త్వరగా మరణిస్తారని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ అధ్యయనంలో తేలింది.

నాలుగు దశాబ్దాలుగా OCDతో బాధపడుతున్న 61,378 మందిపై సైంటిస్టులు అధ్యయనం చేశారు. దీనిద్వారా OCD లేనివారు సగటున 78 ఏళ్ల వరకు జీవిస్తే.. OCD వ్యక్తులు 69 ఏళ్ల వయసులోనే మరణిస్తున్నట్లు తేలింది.