అమెరికా హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ గడువు ఎల్లుండితో ముగియనుంది. ఈ మేరకు USCIS తాజాగా ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం ఆరోజు రాత్రి 9.30 గంటలకు రిజిస్ట్రేషన్లు తీసుకోవడం నిలిపేస్తామని స్పష్టం చేసింది.
దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు ఈలోపుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించింది. ఇక హెచ్-1బీ క్యాప్ పిటిషన్లపైనా వచ్చే నెల 1 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది.