అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్ ల్యాండ్ వరుసగా ఏడో సంవత్సరం కూడా టాప్ లో నిలిచింది. డెన్మార్క్, ఐస్ ల్యాండ్, స్వీడన్, ఇజ్రాయెల్ దేశాలు టాప్-5లో నిలిచాయి.
ఇక తాలిబాన్ల రాజ్యం నడుస్తున్న అఫ్గానిస్థాన్ చిట్టచివరన 143వ స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా 10, యూకే 20, అమెరికా 23, జర్మనీ 24, చైనా 64, రష్యా 70వ స్థానాల్లో ఉన్నాయి. ఇక ఇండియా 126వ ర్యాంకులో నిలిచింది. పాకిస్థాన్ 108వ ప్లేస్ దక్కించుకుంది.