అకాల వర్షాలు, వడగళ్లతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పంటనష్టం అంచనా వేయాలని వ్యవసాయ శాఖను ఆదేశించింది. మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆ తర్వాత పంట నష్టంపై అంచనా వేయనుంది.

ఎకరానికి రూ.10వేలు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించగా.. ఎన్నికల కోడ్ ఉన్నందున EC అనుమతితో పరిహారం ప్రకటించే అవకాశం ఉంది. దాదాపుగా 50వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనా.