సికింద్రాబాద్ – విశాఖ మధ్య ఉదయం 5.05 గంటలకు బయల్దేరే వందేభారత్ టైమింగ్స్ మార్చాలని ప్రయాణికులు కోరుతున్నారు.

తెల్లవారుజామున స్టేషన్ కు చేరుకోవడానికి ఆటోలు, క్యాబ్లు దొరకడం లేదని రైల్వేశాఖకు ఫిర్యాదు చేస్తున్నారు. ఉదయం 6 గంటలకు రైలు బయల్దేరితే అందరికీ అందుబాటులో ఉంటుందంటున్నారు. సికింద్రాబాద్ – కాజీపేట మధ్య మూడో లైన్ పూర్తికాకపోవడంతో ఈ రైలు టైమింగ్స్ మార్చలేకపోతున్నట్లు అధికారులు చెబుతున్నారు.