2026కల్లా రష్యా నుంచి భారత్ కు రావాల్సిన మిగిలిన రెండు ఎస్-400 స్క్వాడ్రన్ల డెలివరీ పూర్తికానుందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. మొత్తం 5 స్క్వాడ్రన్లను ఈ ఏడాదికల్లా న్యూఢిల్లీకి క్రెమ్లిన్ ఇవ్వాల్సి ఉండగా.. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం కారణంగా అవి ఆలస్యమయ్యా యని వివరించాయి.
భారత్ వద్ద ప్రస్తుతం 3 ఎస్-400 స్క్వాడ్రన్లు ఉన్నాయి. ఈ గగనతల రక్షణ వ్యవస్థల్ని చైనా, పాక్ సరిహద్దుల్లో భారత్ మోహరించింది.