ఆకాశమే హద్దుగా అన్నట్లు హైదరాబాద్‌లో భవన నిర్మాణాల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. తాజాగా కోకాపేటలో 63 అంతస్తులతో ఓ భారీ భవనం నిర్మించేందుకు బిల్డర్లు ప్రయత్నిస్తున్నారు.
డిజైన్లు, స్థలం ఎంపిక పూర్తయ్యాక అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం 59 అంతస్థులతో పుప్పాల్‌గూడలో క్యాండూర్ స్కైలెన్, 58 అంతస్తులతో సాస్క్రీన్ పేరుతో జరుగుతున్న నిర్మాణాలే టాప్.