బెంగళూరు బ్రూక్ఫీల్డ్ సమీపంలోని అపార్ట్మెంట్ లో నివసించే ఓ మహిళపై డెలివరీ బాయ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ‘పార్సిల్తో వచ్చిన ఓ డెలివరీ బాయ్ కు తాగేందుకు నీరు ఇచ్చా.. తాగి వెళ్లిపోయాడు.

కొద్దిసేపటికే మళ్లీ వచ్చి బాత్రూమ్ వాడుకోవచ్చా? అని అడిగాడు. సరేనని లోనికి రానిస్తే బాత్రూమ్ నుంచి బయటకొచ్చి కిచెన్ లో నా చేయి పట్టుకొని తప్పుగా ప్రవర్తించాడు. ప్రతిదాడి చేయడంతో పారిపోయాడు’ అని ఆమె చెప్పారు.