కూటమి ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని.. మెజార్టీ కోసమే అందరూ కలిసి పని చేయాలని పవన్ కళ్యాణ్ అన్నారు. YCP అవినీతి కోటలు బద్దలు కొడుతున్నామని చెప్పారు.

అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు భద్రత కల్పిస్తామని హామీనిచ్చారు. మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు ఏడాదికి 4లక్షల చొప్పున ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. నిరుద్యోగ భృతి రూ.3వేలు ఇస్తామన్నారు. కాలుష్య రహిత పరిశ్రమలు స్థాపిస్తామని పేర్కొన్నారు.