భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
✍️దుర్గా ప్రసాద్
టిఆర్ఎస్ పార్టీ విజయం కోసం ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలి : ఎమ్మెల్యే వనమా
కొత్తగూడెం మున్సిపాలిటీ రామవరం పట్టణం పాత పోస్ట్ ఆఫీస్ సెంటర్లో బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న : ఎమ్మెల్యే వనమా
కొత్తగూడెం మున్సిపాలిటి రామవరం పట్టణంలో పాత పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు ..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందంటే కారణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ అని, రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ విజయం కోసం ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిగా పనిచేయాలని, కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని, నా తుది శ్వాస వరకు ప్రజాసేవ చేయడమే తన లక్ష్యం అని అన్న ఎమ్మెల్యే వనమా.