ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా RCBతో జరిగిన మ్యాచ్‌లో కలకత్తా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. RCB పై 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది KKR జట్టు.

205 పరుగుల లక్ష్య ఛేదనలో RCB జట్టు పూర్తిగా చేతులెత్తేసింది. వరుణ్‌ చక్రవర్తి (15/4), సుయాశ్‌ శర్మ (30/3), సునీల్‌ నరైన్‌ (16/2) ధాటికి ఆర్సీబీ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. విరాట్‌ కోహ్లీ (21), డుప్లెసిస్‌ (23), డేవిడ్‌ విల్లీ (20), బ్రేస్‌వెల్‌ (19) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగతాబ్యాటర్లంతా సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే పరిమితమయ్యారు.