గుడ్డులో ఎన్నోరకాల పోషకాలు ఉంటాయి. అందుకే రోజుకో గుడ్డు తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తారు. ప్రతిరోజూ ఉదయాన్నే ఒక ఉడికించిన గుడ్డు తినాలి.

వీటిలో దాదాపు 78కేలరీలు ఉంటాయి. శరీరానికి అవసరమైన కొవ్వు, ప్రొటీన్లు, మినరల్స్ అందుతాయి. రోజూ ఖాళీకడుపుతో ఉడికించిన గుడ్డు తినటం వల్ల చెడు కొలెస్ట్రాల్ను నియంత్రించడంలో బాగా పనిచేస్తుంది. మెదడు పని తీరు మెరుగు పడుతుందని నిపుణులు చెబుతున్నారు.