ప్రపంచవ్యాప్తంగా స్వలింగ సంపర్కం నేరంగా భావించే రోజుల నుంచి స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.
సేమ్-సెక్స్ మ్యారేజీని లీగల్ చేసిన జాబితాలలో గ్రీస్ దేశం వచ్చి చేరింది. స్వలింగ పౌర వివాహాలను అనుమతించే బిల్లును గ్రీస్ పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఇది LGBT హక్కుల మద్దతుదారులకు చారిత్రాత్మక విజయం అని చెప్పొచ్చు.