భూ సమస్యల సత్వర పరిష్కారానికి అందుబాటులో ఉన్న మార్గాలను తెలంగాణ ప్రభుత్వం అన్వేషిస్తోంది.

తహసీల్దార్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేయాలని తాజాగా నిర్ణయించిన సర్కార్.. మరింత వేగంగా భూసమస్యల పరిష్కారానికి తహసీల్దార్లకే అధికారాలు అప్పగించేందుకు కసరత్తు చేస్తోంది. కొత్త ROR చట్టం ప్రకారం.. జిల్లా కలెక్టర్ల అధీనంలో ఉన్న అధికారాల్లో కొన్నింటిని తహసీల్దార్లు, RDOలకు బదలాయించే అవకాశం ఉంది.