గూగుల్ CEO సుందర్ పిచాయ్ పై త్వరలో వేటు పడటమో లేక ఆయన రాజీనామా చేయడమో జరుగుతుందన్నారు హీలియోస్ క్యాపిటల్ వ్యవస్థాపకులు సమీర్ అరోరా.
ఏఐ చాట్‌బోట్ జెమినీ పనితీరుపై వివాదం చెలరేగిన వేళ ఓ నెటిజన్ అరోరాను అభిప్రాయం అడగగా ఈ విధంగా స్పందించారు. ఏఐ అభివృద్ధిలో విఫలమయ్యారని.. మరొకరు బాధ్యతలు అందుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. కాగా జెమినీ ఇమేజ్ జెనరేషన్పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.