ఉక్రెయిన్ లో జరుగుతోన్న యుద్ధంలో కింజాల్, సిర్కాన్ లాంటి హైపర్సోనిక్ క్షిపణులను వాడినట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు.
ఇవి అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను చేరుకున్నాయని తెలిపారు. త్వరలోనే హెవీ స్ట్రాటజిక్ ఖండాంతర బాలిస్టిక్ సర్మట్ మిస్సైల్స్ ను ప్రయోగించనున్నట్లు పేర్కొన్నారు.
అలాగే అణ్వాయుధ క్రూయిజ్ క్షిపణుల ట్రయల్స్ చివరి దశలో ఉన్నాయని చెప్పారు. వాటిని ఉపయోగించడానికి వెనుకాడబోమన్నారు.