బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ డిసెంబర్ నుంచి బాహ్య ప్రపంచానికి కనిపించడం లేదు. జనవరి 17న ఆమెకు పొత్తి కడుపు ఆపరేషన్ జరిగినట్లు ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కార్యాలయం వెల్లడించింది.
సర్జరీ టైమ్లో సమస్యలు రావడంతో ఆమె కోమాలోకి వెళ్లిపోయారనే వదంతులు నెట్టింట వైరలవుతున్నాయి. అయితే ఆమె ఆరోగ్యంగా ఉన్నారని, ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారని ప్యాలెస్ వర్గాలు వెల్లడించాయి.