ఉక్రెయిన్ లో యుద్ధానికి సంబంధించి రష్యా ఉన్నతాధికారులకు ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

యుద్ధ నేరాలకు పాల్పడ్డారంటూ ఇద్దరు రష్యా టాప్ కమాండర్లు లెఫ్టినెంట్ జనరల్ సెర్గీ కోబిలాష్, నేవీ అడ్మిరల్ విక్టర్ సోకోలోవ్లను అరెస్టు చేయాలని ఆదేశించింది.

గతంలో అధ్యక్షుడు పుతిన్, రష్యా పిల్లల హక్కుల కమిషనర్లపైనా వారెంట్ జారీ అయ్యింది. అయితే ఇంటర్నేషనల్ కోర్టును రష్యా లెక్క చేయడం లేదు.