తమిళ నటి విజయలక్ష్మి సెల్ఫీ వీడియో సంచలనంగా మారింది. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ వీడియోను పోస్ట్ చేశారు.
‘నామ్ తమిళర్ కట్చి పార్టీ సమన్వయకర్త సీమాన్ పెళ్లి చేసుకుంటానని మూడేళ్లు నాతో రహస్య జీవితం గడిపారు. ఇప్పుడు మోసం చేసి నడిరోడ్డుపై వదిలేశారు. నా జీవితాన్ని నాశనం చేశారు. కర్ణాటకలో జీవించలేని పరిస్థితుల్లో ఉన్నా. ఇదే నా చివరి వీడియో. నేను ఆత్మహత్య చేసుకోబోతున్నా’ అని వీడియోలో మాట్లాడారు.