టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇవాళ ముంబై ఇండియన్స్ ట్రైనింగ్ క్యాంపులో చేరనున్నట్లు క్రీడావర్గాలు తెలిపాయి. గత కొన్ని నెలలుగా ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచులతో బిజీగా ఉన్న హిట్ మాన్.. క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకున్నారు.

మరో 4 రోజుల్లో ఐపీఎల్-2024 ప్రారంభం కానున్న నేపథ్యంలో నేడు జట్టుతో చేరనున్నారు. ఈ సారి ముంబై కెప్టెన్ గా హార్దిక్ వ్యవహరించనుండగా, రోహిత్ బ్యాటర్ గా ఆడనున్నారు.