ఎలక్ట్రోరల్ బాండ్ల వివరాలు వెల్లడించడంలో గోప్యత తగదని CJI జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం SBI కి స్పష్టం చేసింది.

ఎలక్ట్రోరల్ బాండ్ల నంబర్లతో సహా SBI పరిధిలో ఉన్న అన్ని వివరాలు బహిర్గతం చేయాలని ఆదేశించింది. ఎలక్ట్రోరల్ బాండ్స్ కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. కాగా వివరాలను వెల్లడించడానికి వెనుకాడమని తమ వద్ద అన్ని వివరాలు బయటపెడతామని SBI తరఫు లాయర్ సాల్వే పేర్కొన్నారు.