రష్యా అధ్యక్షుడు పుతిన్ మూడో ప్రపంచ యుద్ధం ప్రస్తావన తీసుకురావడం ప్రపంచ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

రష్యాకు, అమెరికా నేతృత్వంలోని నాటోకు యుద్ధమంటే మూడో ప్రపంచ యుద్ధానికి అడుగుదూరంలోనే ఉన్నట్లని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి పరిస్థితిని ఎవరూ . కోరుకోరని అన్నారు. ‘ఉక్రెయిన్ కు నాటో సైన్యం చేరుకున్నట్లు గుర్తించాం. వారికి ఇది మంచిది కాదు. భారీ సంఖ్యలో కన్నుమూస్తారు’ అని హెచ్చరించారు.