హీరో రానా మరో సరికొత్త టాక్ షోతో ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అయ్యారు. అమెజాన్ ప్రైమ్లో ప్రసారమయ్యే ఈ షోకు ‘ది రానా కనెక్షన్’ అనే పేరుని ఖరారు చేశారు. అయితే ఈ టాక్ షో ఎప్పటి నుంచి ప్రసారం చేస్తారనేది రివీల్ చేయలేదు.

టాలీవుడ్, బాలీవుడ్ తో సహా పలు ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రిటీలను ఈ షోకు ఆహ్వానించే అవకాశాలున్నాయి. గతంలో రానా ‘నంబర్ 1 యారీ’ పేరుతో ఓ టీవీ షోకు హోస్ట్ వ్యవహరించిన సంగతి తెలిసిందే.