ఇజ్రాయెల్ చేసిన కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ ఎట్టకేలకు అంగీకారం తెలిపింది. ఈజిప్టు-ఖతర్ దేశాల మధ్య వర్తిత్వంతో ఈ డీల్ కుదిరింది.
ఈ కాల్పుల విరమణ ప్రణాళిక 42 రోజుల చొప్పున 3 విడతల్లో అమలు కానుంది. ఈ వ్యవధిలో గాజాలో కాల్పుల విరమణ, గాజా పునర్నిర్మాణం, ఖైదీల మార్పిడి వంటివి జరగనున్నాయి. కాగా 15 లక్షల మంది నివసించే రఫాపై ఇజ్రాయెల్ భారీ దాడికి దిగుతున్న వేళ కాల్పుల విరమణ చోటుచేసుకోవడం విశేషం.