రోడ్లపై గుంతల కారణంగా ప్రమాదాలు జరుగుతుండటంతో ఎంతో ప్రాణనష్టం జరుగుతోంది. ప్రస్తుతం గుంతలను మాన్యువల్ గా పూడ్చాల్సిందే.
ఇందుకు చాలా సమయం పడుతోంది. ఇకపై చిన్నపాటి గుంతలు, పగుళ్లు వాటంతట అవే పూడుకుపోయేలా రోడ్ల నిర్మాణంలో సెల్ఫ్ హీలింగ్ మెటీరియల్ వాడనున్నట్లు NHAI వర్గాలు వెల్లడించాయి. స్టీల్ ఫైబర్స్, తారు కలిపిన పదార్థం ఇందులో వాడతారు. గుంత ఏర్పడగానే తారు హీట్ అయి అదే పూడుకుపోతుంది.