బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్ధనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

ఓల్డ్ సిటీతోపాటు మాసబ్యాంక్, మీరాలం దర్గా, లంగర్హౌజ్ వద్ద ట్రాఫిక్ మల్లింపులు ఉంటాయన్నారు. ప్రార్థనల కోసం వచ్చేవారిని మాత్రమే ఈ రూట్లలో అనుమతించనున్నారు. ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు.